Saturday, April 26, 2025

పాముకాటుతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

Girl killed by snakebite in Rangareddy

మంచాల: పాముకాటు తో బాలిక మృతి చెందిన సంఘటన మంచాల మండల పరిధిలోని సత్యంతండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల, బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సత్యంతండా గ్రామానికి చెందిన కొర్ర జవహర్‌లాల్ కుటుంబం పూరి గుడిసెలో నివసిస్తున్నారు. గుడిసేలో నిద్రిస్తున్న జవహ ర్‌లాల్ కుమార్తె జాన్సీ (9)ని తాచుపాము కాటేసింది. దీంతో తల్లి దండ్రులు జాన్సీని హుటహుటిన సమీపంలోని లోయపల్లి గ్రామా నికి చికత్స కోసం తరలించారు. అక్కడ వైద్యులు ఇబ్రహీంపట్నంకు తీసుకవెళ్లాలని సూచించారు. దీంతో పరిస్థితి విషమించి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News