Wednesday, January 22, 2025

నాలుగో అంతస్తు నుంచి బాలికను తోసి చంపిన యువకులు

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 16 బాలికను నలుగురు యువకులు ఒక అపార్ట్‌మెంట్ నాలుగవ అంస్తుపై నుంచి కిందకు తోసివేయడంతో ఆ బాలిక మరణించింది. రాష్ట్ర రాజధాని రాంచికి 170 కిలోమీటర్ల దూరంలోని బర్వాద పోలీసు స్టేషన్ పరిధిలోని భేలాటండ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదే ఆపార్ట్‌మెంట్‌లో నివసించే ఇద్దరు యువకులతోసహా నలుగురు అనుమానితుల పేర్లను బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నలుగురు అనుమానితులను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి అమర్ కుమార్ పాండే తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News