Wednesday, January 22, 2025

ప్రియుడి ఇంటిని తగలబెట్టిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియుడి ఇంటిని ప్రియరాలు తగలబెట్టిన సంఘటన ఒడిశాలోని బసుదేవ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రుకునాదేవ్ గ్రామంలో ఓ యువకుడు, యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో యువతికి యువకుడు దూరంగా ఉంటున్నాడు. తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని ప్రియుడి డిమాండ్ చేయడంతో అతడిని ఆమె బెదిరించింది. ప్రియురాలు మరో వ్యక్తితో కలిసి ప్రియుడి ఇంటికి వెళ్లింది. ప్రియుడి కుటుంబ సభ్యులతో గొడవకు దిగింది. అనంతరం అతడి ఇంటిని తగలబెట్టింది. దీంతో ప్రియుడు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి వద్ద నుంచి యువతి రూ.20 లక్షలు తీసుకొని ఇవ్వడంలేదని ప్రియుడి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News