Sunday, April 6, 2025

రైల్లో బాలికకు లైంగిక వేధింపులు..వీడియో తీసిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

రైలులో ప్రయాణిస్తున్న బాలికను లైంగికంగా వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వాష్ రూంకు వెళ్లిన బాలికను నిర్భందించి నిందితుడు వీడియో తీశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన పెద్దకుమార్తె(12) వాష్ రూంకు వెళ్లింది.

అదే సమయంలో వెనుకే వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే అరగంటపాటు ఆమెను బంధించి లైంగికంగా వేధించాడు. వేధింపులను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. బాలికను తర్వాత నిందితుడు వదిలిపెట్టడంతో వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు నిందితుడిని పట్టుకొని ఫోన్ పరిశీలించగా వీడియోలు బయటపడ్డాయి. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నంబరు 139కి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ మేరకు రైల్వే పోలీసులు చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News