Sunday, January 19, 2025

అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికకు 16 కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

లక్నో: అత్యాచారాన్ని ప్రతిఘటించిన ఒక బాలికను దుండగులు 16 సార్లు కత్తిపోట్లు పొడిచారు. ఉత్తర్ ప్రదేశ్ టక్నో నగరంలోని పిజిఐ కొత్వాలీ ప్రాంతంలో గురువారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

కోచింగ్ క్లాసుకు వెళ్లి స్కూటీపై ఇంటికి తిరిగివస్తున్న ఆ బాలికను అడ్డగించిన ఒక యువకుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు పంకజ్ రావత్, అతని మిత్రులు ఆ బాలికను 16 సార్లు కత్తితో పొడిచారు. ఆ బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
నిందితుడు పంకజ్ రావత్ గత ఏడాది కాలంగా ఆ బాలికను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు పిజిఐ పోలీసు స్టేషన్‌లో అప్పట్లోనే ఫిర్యాదు చేయగా పోలీసులు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించి వేశారు.

తాజాగా తన కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించడమే గాక ఆమెను కత్తితో పొడిచిన నిందితులపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పంకజ్, అతని మిత్రుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News