Monday, December 23, 2024

మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడండి: ఆర్టీసి ఎండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాత్రి సమయంలో బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఓ యువతి చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ ఎండి సజ్జనార్ స్పందించారు. ఆమె సూచించిన సమస్యకు అధికారులకు సూచనలు జారీ చేశానని ఎండి సజ్జనార్ ఆ యువతి రీ ట్వీట్ ద్వారా తెలియచేశారు. ప్రస్తుతం ఈ విషయమై నెటిజన్‌లు సైతం ఆర్టీసి సంస్థతో ఎండిని ప్రశంసిస్తున్నారు. ప్రయాణికులు చేసే సూచనలకు వెంటనే ఎండి స్పందించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలే నిషా అనే యువతి అర్ధరాత్రి సమయంలో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంపులలో 10 నిమిషాలు బస్సును ఆపాలని అర్ధరాత్రి టిఎస్ ఆర్టీసికి ట్వీట్ చేసింది. రాత్రి సమయంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి ఆ ట్వీట్‌లో పేర్కొంది. అర్ధరాత్రి చేసిన ట్వీట్‌కు ఆర్టీసి ఎండి సజ్జనార్ స్పందించడంతో పాటు అధికారులకు సూచనలు జారీ చేశామని ఆయన ఆ యువతికి రీ ట్వీట్ చేశారు.

Girl tweet to Sajjanar on Women Passengers problems

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News