Sunday, December 22, 2024

బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది. సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా పండగ జరుపుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణమైంది. గ్రామానికి చెందిన ఓ యువకుడి కారులో ఎక్కింది. అందులో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. బస్సు ఆగే దగ్గర దింపారు.

ఈ క్రమంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆ బాలికను  సదరు యువకుడికి బట్టల షాప్ ఉండటంతో ఎండలో ఏం నిల్చుంటావు లోపలికి రా అని చెప్పాడు.  ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై  ఈ క్రమంలోనే బాలిక స్పృహ తప్పి పడిపోయింది. భయపడిపోయిన యువకులు బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్దారించగా ముగ్గరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక ఆ తండ్రి ముగ్గరు యువకుల పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News