- Advertisement -
గువాహతి : అస్సాం లోని కరీంగంజ్ ప్రాంతంలో బాలికపై ఆరుగురు బాలురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జరిగింది. తేయాకు తోటల్లో పనిచేసే కుటుంబాలకు చెందిన ఆరుగురు బాలురు రామకృష్ణనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కాళీనగర్ ఏరియాలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరంతా 1315 ఏళ్ల లోపు వారేనని పోలీసులు చెప్పారు. బాలనేరస్తులుగా పరిగణించి సంబంధిత కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు.
- Advertisement -