- Advertisement -
అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో దారుణం జరిగింది. ఓ 40 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలల క్రితం 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక బార్‌పేటలోని ఆసుపత్రిలో సోమవారం ప్రసవించింది తరువాత మృతి చెందింది. బాలిక మరణించిన 24 గంటల్లోనే బాలిక జన్మినిచ్చిన బిడ్డ కూడా చనిపోయింది. ఈ విషయం చెబితే నిందితుడు చంపేస్తానని బెదిరించాడని బాలిక కుటుంబం తెలిపింది. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు
- Advertisement -