Saturday, December 21, 2024

పెళ్లి ప్రస్తావన… ప్రియుడిపై బ్లేడ్‌తో ప్రియరాలి దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసిన సంఘటన నగరంలోని కేపీహెచ్ బీ కాలనీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరుకు చెందిన అశోక్, రాజమండ్రికి చెందిన లక్ష్మిసౌమ్యలకు హాస్టల్ వద్ద పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో గత కొద్ది రోజులుగా లవ్ చేసుకుంటున్నారు. అశోక్ తరుచూ పెళ్ళి ప్రస్తావన తీసుకు రావడంతో లక్ష్మీసౌమ్య కోపంతో ఊగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5 తేదీన పెళ్ళి ప్రస్తావన మళ్లీ రావటంతో అశోక్ పై బ్లేడుతో దాడి చేసింది. ఈ దాడిలో అశోక్ చెంప కింద గాయం అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News