Wednesday, January 29, 2025

న్యాయం కోసం ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు నిరసన

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్: మండలంలోని తెర్లుమద్దికి చెందిన యువకుడు ముస్తాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతిని ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. కాగా ప్రియురాలు ఒత్తిడి మేరకు గత మూడు సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులను ఒప్పించి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్యన నిశ్చితార్థం చేసుకున్నాడు. తన చెల్లెలి వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో తెలపడంతో కుటుంబ పెద్దలు అంగీకరించారు. మూడు సంవత్సరాలు కాలం కలిసి పోవడంతో పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు యువకుడు ని అడిగింది. దీంతో నేను వివాహం చేసుకొని నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు.

దీంతో ఆందోళన చెందిన యువతి కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగారు. కాగా తమకు ఎలాంటి సంబంధం లేదని తమ కొడుకు పెళ్లి చేసుకోడట అని వారి తల్లిదండ్రులు వివరించారు. దీంతో యువతి న్యాయం కోసం వారి ఇంటి ఎదుట బైఠాయించగా ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఐదు రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ ఆ ఇంటి బయటే ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలు బంధువులు ప్రియుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పటికీ వారు ససే మీరా అని చెప్పడంతో యువతి తో పాటు వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతం అవుతున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదని ఆ యువతీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News