- Advertisement -
కేరళ రాజధాని తిరువనంతపురం కోర్టు మరో కీలక తీర్పు వెల్లడించింది. ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను ప్రియురాలు గ్రీష్మ చంపిన ఘటన సంచలన సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పూర్తి ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన తిరవనంతపురం కోర్టు.. గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు వెలువరించింది. అంతేకాదు.. శరోన్ రాజ్ ను చంపేందుకు గ్రీష్మకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
- Advertisement -