Friday, November 22, 2024

నకిలీ ఎన్‌సిసి క్యాంపులో బాలికలపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: కృష్ణగిరి జిల్లాలో నకిలీ ఎన్‌సిసి క్యాంపు నిర్వహించి మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిపినట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం ప్రకటించారు. సీనియర్ ఐపిఎస్ అదికారిణి కె భవనీశ్వరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ 15 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలను సిఫార్సు చేసేందుకు మల్టీ డిసిప్లినరీ టీమ్(ఎండిటి)ను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టీమ్‌కు సంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్ సారథ్యం వహిస్తారు.

ఈ టీమ్‌లో పోలీసు, పాఠశాల విద్యా శాఖలకు చెందిన ప్రతినిధులుగా కూడా ఉంటారు. కృష్ణగిరి జిల్లాలోని బర్గూర్ వద్ద ఇటీవల జరిగిన నకిలీ ఎన్‌సిపి క్యాంపులో ఒక 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాలలో కూడా ఈ తరహా నకిలీ ఎన్‌సిసి క్యాంపులను నిర్వహించిందీ లేనిదీ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News