Thursday, January 23, 2025

నీట్ పరీక్షలో ‘లోదుస్తుల’ వివాదం..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆదివారం జరిగిన నీట్ (ఎన్‌ఇఇటి) పరీక్ష సందర్భంగా చెన్నై లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థినులు బ్రా ధరించకూడదన్న నిబంధనకు గురికావడం, ధరించి వచ్చిన కొందరితో బలవంతంగా విప్పించడం వివాదాస్పదమైంది. చెన్నై లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్ ఓ యువతి సిగ్గుగా ఉండడం గమనించారు. ఆమె వద్ద నుంచి ఆరా తీయగా పరీక్ష రాస్తున్నప్పుడు బ్రా ఉండకూడదని బలవంతంగా ఇప్పించినట్టు చెప్పిందని జర్నలిస్టు పేర్కొన్నారు. తాను ఆమెకు శాలువా ఇవ్వాలని ప్రయత్నించగా ఆమె సున్నితంగా ఒప్పుకోలేదని, ఇంటికి తీసుకువెళ్లడానికి తన సోదరుడు వస్తాడని చెప్పినట్టు జర్నలిస్టు వివరించారు. ఈ సంఘటనను జర్నలిస్ట్ ట్రోల్ చేయడానికి ప్రయత్నించగా, అక్కడున్నవారంతా బలవంతంగా తొలగింప చేశారు.

పరీక్షకు వచ్చిన వారిలో సగానికి సగం మంది లోదుస్తులు ధరించలేదని జర్నలిస్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే కొందరు దీనిపై మహిళా జర్నలిస్టును ఎగతాళి చేయడమే కాక, విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఆమె వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. అసభ్య కరమైన ప్రశ్నలు నన్ను అడగడానికి బదులు బ్రా ధరించడానికి అనుమతి ఉందా లేదా అని పరీక్ష బోర్డును అడగాలని ట్వీట్ చేశారు. తమిళనాడులో మొత్తం 1.5 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. దీనిపై తమిళనాడు విద్యామంత్రి అనిబిల్ మహేష్ పొయ్యమొజి స్పందించారు. ఇలాంటి చర్యలను ఇప్పటికే సిఎం స్టాలిన్ వారించారని చెప్పారు.

నిబంధనలుకు విరుద్ధంగా ఎలాంటి ఉల్లంఘన జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు. విద్యార్థులు నిబంధనలకు లోబడే ఇష్టపూర్వకంగా పరీక్షకు వెళ్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నీట్ నిర్వహించే సంసకు, ఇలాంటి సమస్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News