Wednesday, January 22, 2025

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య!

- Advertisement -
- Advertisement -

అమరావతి: దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో కేరళ ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2021-22 గణాంకాల ప్రకారం ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేరళలో 1,114 మంది అమ్మాయిలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది అమ్మాయిలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,41,28,100 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో పట్టణ ప్రాంతంలో 4,45,600 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతంలో 96,72,100 కుటుంబాలు నివసిస్తున్నాయి. సగటు కుంటుంబ పరిమాణం 3.3గా ఉంది. పట్టణాల్లో ఇది 3.2గా, గ్రామీణ ప్రాంతంలో 3.4గా ఉంది.

2021-22లో ప్రతి వేయి మంది అబ్బాయిల కంటే అధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రాలు ఇవే:

కేరళ 1,114
ఆప్ర 1,046
హిమాచల్‌ప్రదేశ్1,031
తమిళనాడు 1,026
మేఘాలయ 1,017
ఛత్తీస్‌గఢ్ 1,016
జార్ఖండ్ 1,001

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News