Monday, December 23, 2024

అందుకే మౌనంగా ఉండిపోతున్నారు

- Advertisement -
- Advertisement -

Girls who enter industry face harassment at some stage

హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని… స్టార్‌గా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఏదో ఒక స్టేజ్‌లో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దీనిపై నోరు విప్పి మాట్లాడే వారు తక్కువ. అయితే బాలీవుడ్‌లో వేధింపులు ఉన్నా కూడా వాటి గురించి బయటపెట్టడానికి ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదని అంటోంది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. “హీరోయిన్లుగా అడుగుపెట్టే వారిలో చాలా మందికి ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఉండదు. దాంతో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు భరించాల్సి వస్తోందని కొందరు నాతో బాధను పంచుకున్నారు. కానీ ఇదే విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేమని వాళ్లు అన్నారు. ఎందుకంటే దీన్ని చీప్ పబ్లిసిటీగా భావిస్తే అది వాళ్ల కెరీర్‌కే నష్టమని భావించి మౌనంగా ఉండిపోతున్నారు”అని చెప్పింది తాప్సీ. కానీ అదృష్టవశాత్తు తన కెరీర్‌లో ఎటువంటి వేధింపులు ఎదురుకాలేదని పేర్కొంది తాప్సీ. ఒకవేళ ఎదురైతే తప్పకుండా ఈ విషయాన్ని బయటకు చెబుతానంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News