Monday, January 20, 2025

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన గరువారం రామన్నపేటమండలంలోని నీర్నెముల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నీర్నెముల గ్రా మానికి చెందిన సుర్వి లింగస్వామి (47) గీత వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య,ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

గురువారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ రైతు పొల ంవద్ద కల్లు గీస్తుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టుపైనుండి బురద పొలంలో పడ్డాడు. తలకు ,కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కలవారు వచ్చి బురదలోనుండి లింగస్వామిని లేపి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే లింగస్వామి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో వి షాధఛాయలు అలుముకున్నాయి.మృతుడి భా ర్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News