Friday, December 20, 2024

తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

దామరచెర్లః తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతులూరి శ్రీనివాస్‌గౌడ్(38) యదావిధిగా కల్లు గీసేందుకు సోమవారం ఉదయం 5గంటలకు తాటి చెట్టు ఎక్కుతుండగా కాలుజారి కిందపడి పోయాడు. దీంతో  స్థానికులు అతనిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు.

. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ మృతితో గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మృతుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News