Friday, December 20, 2024

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన కడ్తాల మండలం చరికోండ గ్రామంలో సోమవారం ఉద యం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చరికోండ గ్రామానికి చెం దిన గుడముల్ల అబ్బయ్య గౌడ్(50) గీత కార్మికుడు రోజు మాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీసే క్రమ ంలో గోలుసు తెగి చెట్టుపై నుండి తలకిందులుగా పడి, కింద ఉన్న వరిచేనులో బురదలో తల కురుకుపోయి తీవ్ర రక్త స్రావానికి గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎసై హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News