Sunday, January 19, 2025

5వ అంతస్థుపై నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు: ఇంజినీరింగ్ విద్యార్థి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం విశ్వ విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… గీతం విశ్వ విద్యాలయంలో రేణుశ్రీ (18) బిటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. రేణుశ్రీ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉండటంతో రోజూ మాదాపూర్ నుంచి కళాశాలకు వస్తూపోతుండేది. ఏం జరిగిందో తెలియదు కానీ రేణుశ్రీ శుక్రవారం కళాశాల భవనం ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

వెంటనే కళాశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా రేణుశ్రీ కళాశాలలో చేరి మూడు నెలలే అవుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదుగుతుందని అనుకున్న సమయంలో మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News