Saturday, November 2, 2024

ఎంఎస్‌పిపై కమిటీలో చేర్చేందుకు ఐదుగురి పేర్లను అడిగిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Give 5 farmers names for talks on MSP: Centre

4న జరిగే భేటీలో నిర్ణయించనున్న సంయుక్త కిసాన్ మోర్చా

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరలతో పాటుగా రైతులకు సంబంధించిన పలు అంశాలను చర్చించడం కోసం ఏర్పాటు చేయబోయే కమిటీలో చేర్చడం కోసం కేంద్రం సంయుక్త కిసాన్ మోర్చాను అయిదు పేర్లు అడిగిందని, డిసెంబర్ 4న జరిగే మోర్చా సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు దర్శన్ పాల్ మంగళవారం చెప్పారు. మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం రైతులను కమిటీలో చేర్చేందుకు ఐదుగురి పేర్లను ఇవ్వాలని కోరడం గమనార్హం. ‘రైతులు పండించే పపంటలకు కనీస మద్దతు ధరపై చర్చించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో చేర్చడం కోసం ఐదుగురి పేర్లను ఇవ్వాలని కేంద్రం ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చాను అడిగింది. ఈ పేర్లను మేము ఇంకా నిర్ణయించలేదు. డిసెంబర్ 4న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని దర్శన్ పాల్ పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ఇదిలా ఉండగా పెండింగ్ డిమాండ్లపై చర్చించడానికి, రైతుల ఆందోళన, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి మోర్చా సమావేశం బుధవారానికి బదులు డిసెంబర్ 4న జరుగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు రైతులకు సంబంధించిన పలు డిమాండ్ల సాధనకోసం ఆందోళన చేస్తున్న 40 రైతుల సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఉమ్మడి వేదికగా ఏర్పడిన విషయం తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం కోసం మోర్చా అత్యవసర సమావేశం బుధవారం జరుగుతుందని పంజాబ్‌కు చెందిన రైతు సంఘాలు సోమవారం చెప్పడం తెలిసిందే. అయితే ఈ సమావేశం ఇంతకు ముందు ప్రకటించినట్లుగా బుధవారం కాక డిసెంబర్ 4న జరుగుతుందని ఎస్‌కెఎం వివరణ ఇచ్చింది. సింఘు సరిహద్దు వద్ద జరిగే ఈ సమావేశంలో అన్ని పెండింగ్ అంశాలను చర్చించడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుందని మోర్చా తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News