Wednesday, January 22, 2025

ఇక.. కోరిన వారికే ఉచిత విద్యుత్: కేజ్రీవాల్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

Give a missed call Who want free Electricity: Kejriwal

న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ పొందదలచుకున్న ఢిల్లీవాసులకు మాత్రమే ఈ పథకం అక్టోబర్ నుంచి వర్తిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని పొందదలచుకున్న వారు నేటి నుంచి(బుధవారం) 7011311111 నంబర్‌కు మిస్డ్ కాల్ కాని వాట్సాప్ సందేశం కాని పంపవచ్చని బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇక మీద ఢిల్లీ వాసులందరికీ ఉచిత విద్యుత పథకం లభించదు. తమకు ఈ పథకం కావాలని కోరుకున్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది.

ప్రస్తుతం, 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందచేస్తోంది. 400 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నవారికి 50 శాతం సబ్సిడీ లభిస్తోంది. తమ విద్యుత్ బిల్లులను పూర్తిగా చెల్లిస్తామని చాలామంది వినియోగదారులు చెబుతున్నారని, విద్యుత్ సబ్సిడీని వదులుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. కాగా.. తమకు ఉచిత విద్యుత్ కావాలని కోరుకున్న వారికి మాత్రం ఈ పథకం కొనసాగుతుందని, అయితే వారు ఇందుకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సబ్సిడీ కోసం భౌతికంగా, ఎలెక్ట్రానిక్ పద్ధతుల్లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

Give a missed call Who want free Electricity: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News