Monday, December 23, 2024

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై నివేదిక అందజేయలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది.మేడిగడ్డ బ్యా రేజికి చెందిన పిల్లర్లు కుంగిన ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు నిరంజన్ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవటంలో పలు అనుమానాలు ఉన్నట్టు తెలిపారు.మహదేవపురం పోలీస్టేషన్‌లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. పిల్లర్ల్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావవటంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నే పధ్యంలో సిఎస్ శాంతికుమారి నుంచి సమాచారం తీసుకుని నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లో ఈ వివరాలు అందజేయాలని ప్రభుత్వతరుపు న్యాయవాదికి ఆదేశా లు జారీ చేసింది. కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News