Friday, December 27, 2024

ప్రమాణ స్వీకారానికి మరొక రోజు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

శాసనసభ సెక్రటరీకి కెటిఆర్ విజ్ఞప్తి
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సర్జరీ నేపథ్యంలో
ఎంఎల్‌ఎల ప్రమాణ స్వీకారానికి
హాజరు కాలేకపోయిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కెసిఆర్ సర్జరీ నేపథ్యంలో శనివారం అసెంబ్లీలో జరుగుతున్న ఎంఎల్‌ఎల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కె.టి.రామారావు రాష్ట్ర శాసనసభ సెక్రటరీని కోరారు.

తమ పార్టీ అధినేత, తన తండ్రి కెసిఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశానికి కూడా కెటిఆర్ హాజరు కాలేకపోయారు. కెసిఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎంఎల్‌ఎగా మరో రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News