- Advertisement -
వారణాసి : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోని జ్ఞాన్‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మెజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ని ఆదేశించింది. జిల్లా న్యాయస్థానం సూచించిన వ్యక్తి ఆ వస్తువులను భద్రపరచాలని, అవసరమైనప్పుడు వాటిని కోర్టుకు అందించాలని చెప్పింది. ఈ కేసులో హిందూ మతానికి సంబంధించి ఏ చిన్న వస్తువు దొరికినా దాన్ని కోర్టుకు అందజేయాలని, జిల్లా మెజిస్ట్రేట్‌కు లేదా వారు నామినేట్ చేసిన అధికారి ఆ వస్తువులను భద్రంగా దాచాలని ధర్మాసనం పేర్కొంది. జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని దాఖలైన వ్యాజ్యం చెల్లుబాటును ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
- Advertisement -