Sunday, September 8, 2024

రుణాలపై ఫిక్స్‌డ్ వడ్డీ ఆప్షన్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

ముంబై : గృహ రుణాలు లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో ఇతర రుణాలలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇఎంఐ ద్వారా లోన్లను చెల్లించే వ్యక్తిగత రుణగ్రస్తులకు ఫిక్స్‌డ్ వడ్డీ రేటు విధానం లేదా రుణాల కాలపరిమితి పొడిగింపునకు అనుమతి ఇచ్చేందుకు గాను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 10న ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇఎంఐ వ్యవధిని పెంచడం లేదారెపో రేటు పెరగడంతో ఏకపక్షంగా కస్టమర్‌కు సమాచారం ఇవ్వకుండా ఇఎంఐని పెంచడం గురించి ప్రస్తావించారు. కస్టమర్ల నుండి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో రుణాల వడ్డీ రేట్లను మార్పు చేసే వ్యవస్థ మరింత పారదర్శకంగా తీసుకొస్తామని గవర్నర్ చెప్పారు. శుక్రవారం ఆర్‌బిఐ ఈ ఆందోళనలను పరిష్కరించడానికి తగిన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయవలసిందిగా బ్యాంకులను-, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను కోరింది.

ఈ సూచనల్లో రుణాన్ని మంజూరు చేసేటప్పు డు, బ్యాంకులు-హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు బెంచ్‌మార్క్ వడ్డీ రేటులో మార్పు తర్వాత ఇఎంఐ వ్యవధి లేదా ఇఎంఐలో మార్పు ఉండవచ్చని రుణగ్రహీతలకు తెలియజేయాలి. ఇఎంఐలో మార్పు, దాని వ్యవధి గురించి తగిన మార్గాల ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని ఆర్‌బిఐ ఈ ఆర్థిక సంస్థలను కోరింది. రుణ వడ్డీ రేటు రీసెట్ సమయంలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ వినియోగదారులకు బోర్డు ఆమోదించిన పాల సీ ఆధారంగా ఫిక్స్‌డ్ రేట్ లోన్‌లకు మారడానికి ఒక ఎం పికను అందించాలి. దీంతో పాటు ఇఎంఐ చెల్లింపు వ్యవధిలో రుణగ్రహీత ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్ లేదా ఫిక్స్‌డ్ ఫ్లోటింగ్ రేట్ లోన్‌కి ఎన్నిసార్లు మారవచ్చో కూడా ఈ ఆర్థిక సంస్థలు తెలియజేయాలని ఆర్‌బిఐ సూచించింది. ఇంకా రిజర్వు బ్యాంక్ పలు సూచనలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News