Monday, December 23, 2024

‘బోర్న్ టు షైన్’ ఉపకార వేతన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Give India and ZEE launch Born to shine scholarship

ముంబై: బొగ్గు గనుల నుంచి డైమండ్‌లను వెలికితీయడం అంత సులభమైన పని కాదు. 1.3 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో, యువ ప్రతిభను గుర్తించడం, దానిని పెంపొందించడం ఎంతో క్లిష్టమైన పని. ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల కోసం లాంచ్ ప్యాడ్ అయిన ‘బోర్న్ టు షైన్’ కార్యక్రమం కోసం గివ్ ఇండియాతో పాటు జీ సిఎస్ఆర్ చేతులు కలిపింది. భారతీయ కళారూపాల్లో యువత నైపుణ్యాన్ని గుర్తించడం, వారు రాణించడానికి ఉపకార వేతనాలను అందించడం ద్వారా ఈ ప్రోత్సాహం మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఉపకారవేతనం బాలికలకు స్వయం సాధికారతను అందించడమే కాకుండా, భారతీయ కళారూపాల పునరుద్ధరణకు ప్రయత్నించే ఒక మార్గం.

ప్రత్యేకించి కళారూపాల విషయానికి వస్తే, భారతదేశంలో అపారమైన టాలెంట్ ఉంది, అయితే చాలా అరుదుగా ఈ ప్రతిభావంతులను గుర్తించి, గౌరవించడం జరుగుతుంది. పరిమితమైన రీతుల్లో వారి ప్రతిభను పెంపొందించుకోవడం గురించి ఆందోళన చెందే కళాకారుల్లో ప్రేరణ లోపించడం వల్ల, వివిధ కళారూపాలలో చేతివృత్తులవారి సంఖ్య తగ్గడానికి దారితీసింది, బోర్న్ టూ షైన్ ఈ అడ్డంకులను అధిగమించడం, అలానే భారతదేశంలో తరువాతి తరం రోల్ మోడల్స్‌గా ఎదగాలనే ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి యువతకు సహాయపడాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. చైల్డ్ ప్రోడిజీలు తమ పూర్తి సామర్థ్యాన్ని పొందేందుకు వారు అర్హత కలిగిన పూర్తి సంరక్షణ మరియు శ్రద్ధను పొందేలా చూడాలని మేం కోరుకుంటున్నాం.

బోర్న్ టూ షైన్ ద్వారా, మేం కేవలం స్కాలర్‌షిప్‌లను మాత్రమే అందించడం లేదు, చైల్డ్ ప్రోడిజీలను గుర్తించడానికి, పెంపొందించడానికి మరియు విజయానికి మార్గనిర్దేశం చేయగల ఎకో సిస్టమ్‌లను కూడా రూపొందిస్తున్నాం. అసాధారణమైన విషయాలను సృష్టించడంపై జీ ఎల్లప్పుడూ దృష్టి సారించింది మరియు గివ్ ఇండియా భాగస్వామ్యంతో, అసాధారణ టాలెంట్‌ని పెంపొందించడానికి, మార్గనిర్దేశం చేయడానికి మాకు ఇప్పుడు అవకాశం ఏర్పడింది.

ఎవరు అప్లై చేయవచ్చు?

ఏదైనా ఆర్ట్ ఫార్మ్‌లో మాస్టరీ సాధించి, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండే ఎవరైనా బాలిక బోర్న్ టు షైన్ స్కాలర్‌షిప్‌ని అప్లై చేయవచ్చు. రివార్డుగా మూడు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ని అందిస్తారు. ఇది బాలమేధావులు వారి పూర్తి సామర్థ్యానికి చేరుకోవడానికి దోహదపడుతుంది. 6 వారాల అప్లికేషన్ ప్రక్రియ అన్ని భాషలు. భౌగోళిక ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది, 100-300 చైల్డ్ ప్రోడిజీలను షార్ట్‌లిస్ట్ చేయడానికి సాయపడుతుంది. దేశవ్యాప్తంగా టాప్ 30గా నిలిచినవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మాస్ట్రో హోదాను సాధించడానికి ఉపకార వేతనాన్ని పొందుతారు.

ఈ ప్రోత్సాహం ద్వారా, మేం 60,000లకు పైగా స్కూల్స్‌ని చేరుకోవాలని, ఎలాంటి పక్షపాతం, వివక్ష లేకుండా సెలక్షన్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అభ్యర్ధులను ఎంచుకోవడానికి వర్చువల్, భౌతిక ఫార్మెట్‌లు రెండూ ఉపయోగించబడతాయి.

ఉమేష్ కెఆర్ బన్సాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మాట్లాడుతూ.. “ఒక బ్రాండ్‌గా, శ్రేష్టమైనది అందించడానికి మేం ఎల్లప్పుడూ అచంచలంగా కృషి చేస్తున్నాం. ప్రభావాన్ని చూపించే అర్థవంతమైన చర్యల ద్వారా ప్రపంచాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే బోర్న్ టూ షైన్, ఈ చొరవ కళాకారులు, చైల్డ్ ఆర్ట్ ప్రోడిజీల ప్రపంచానికి భారీ మార్పును తీసుకురావడానికి మాకు సాయపడుతుందని మేం ఆశిస్తున్నాం. వారు రాణించడం చూడటం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అసాధ్యాన్ని సాధించడాన్ని మించిన ఉత్తేజకరమైనది ఏదీ లేదు.”

రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి: https://borntoshine.in/apply/

Give India and ZEE launch Born to shine scholarship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News