Wednesday, January 22, 2025

జనగామ టికెట్ పల్లాకే ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్‌కు బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల వినతి

మన తెలంగాణ/హైదరాబాద్ : పల్లా రాజేశ్వర్ రెడ్డికే మా మద్దతు అంటూ జనగామ నియోజకవర్గ బచ్చన్నపేట మండల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఘటకేసర్ మండలం ఔషపూర్ గ్రామ శివారులో జనగామ నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కొరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికే బిఆర్‌ఎస్ పార్టీ తరఫు టికెట్ ఇవ్వగలరని బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సిఎం కెసిఆర్‌ని ప్రజలు వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతు బంధు సమితి సమన్వయకర్త ఇర్రీ రమణా రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రా రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ పూర్ణచందర్, వైస్ ఎంపిపి అనిల్ రెడ్డి, బచ్చన్నపేట సర్పంచ్ మల్లా రెడ్డి, కొ-ఆప్షన్ మెంబర్ షబ్బీర్, కేసిరెడ్డిపల్లి ఎంపిటిసి వేణుగోపాల్, మాజీ జెడ్‌పిటిసి విద్యాసాగర్, మండల యూత్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, ఆలంపూర్ సర్పంచ్ బాల్ రెడ్డి, ఇట్కియాల సర్పంచ్ వెంకట రెడ్డి, ఆర్య వైశ్య జిల్లా యూత్ అధ్యక్షులు సందీప్, బిఆర్‌ఎస్ పార్టీ బచ్చన్నపేట నరేందర్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News