Monday, January 20, 2025

రుణమాఫీ డబ్బులు రైతులకు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

అప్పుల కింద జమ చేసుకోవద్దు
బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్, నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : పంట రుణాల మాఫీ డ బ్బులను పాత అప్పుల కింద జమ చేసుకోకుండా నేరుగా రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను కో రింది. ఒకవేళ రైతులు అప్పటికే పంట రుణాలను చెల్లిం చి ఉన్నట్లయితే మాఫీ అయిన డబ్బును నేరుగా వారి చేతికే ఇవ్వాలని ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు, వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు సోమవారం జరిగిన 38వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం లో కోరారు. పంట రుణాల బకాయిలు చెల్లించకపోతే వారికి మాఫీ చేయాలని మంత్రలు బ్యాంకర్లను కోరారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు తీసుకొని ఉండవచ్చునని, అలాంటి రైతుల రు ణాల బకాయిలను వారికి వచ్చిన రుణమాఫీ డబ్బులను పాత అప్పులకు జమచేసుకోకుండా నేరుగా రైతులకే ఇవ్వాలని మంత్రులు కోరారు. కొందరు రైతులకు ఒకటి కంటే ఎక్కువ ఎక్కౌంట్లు ఉంటాయని, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో ఎక్కౌంట్ ఉన్న వారికి రెండు ఖాతాల్లోకి కొంత మొత్తం చేరేలా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని, మొత్తంగా తమకు ప్రభు త్వం అందించిన డబ్బు వచ్చిందని రైతులు సంతోషపడాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీష్‌రావు బ్యాంకర్లను కోరారు.

పంట రుణాన్ని రెన్యువల్ చేసి రైతు చేతికి డబ్బు ఇస్తే ప్రభుత్వం అందించిన సా యం తమ చేతికి వచ్చిందని రైతు కుటుంబాలు భావిస్తాయని మంత్రి హరీష్‌రావు ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని బ్యాంకర్లకు వివరించారు. ఈ కమిటీలో ఆర్ధిక, వ్య వసాయశాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్‌రంగ ప్రతినిధు లు ఉంటారని, వారానికి ఒకసారి సమావేశమై ఏ బ్యాం కు నుంచి ఎంతమంది రైతులకు డబ్బు వెళ్ళిందోననే అం శాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కరోనావల్ల రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గినా రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రుణమాఫీని అమలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు బ్యాంకర్లకు వివరించారు. బ్యాంకర్లు దీనిని అర్ధంచేసుకొని సహకరించారు. అభ్యర్ధించారు. సాధారణంగా కొన్ని బ్యాంకు లు విడదల వారీగా కొన్ని గ్రామాల లెక్కన మాఫీ చేస్తూ రెండు మూడు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయని, కానీ ఈసారి బ్యాంకర్లు కొంచెం శ్రమ తీసుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

రైతుబంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత వి ద్యుత్తు వంటి పథకాల వల్ల రైతులకు భరోసా దక్కిందని, రుణమాఫీ డబ్బులు నేరుగా వారికి అందిస్తే మరింతగా సంతోషపడతారని మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశం లో ఇతర రాష్ట్రాలు రుణమాఫీ చేసేందుకు అనేక షరతులు, పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని, రెండుసార్లు రుణమాఫీ చే యడం ఆయనకే చెల్లిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మొదటి దఫాలో 35 లక్షల మందికి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే, ఈసారి ఇప్పటి వరకూ 99,999 రూపాయ ల రుణాలు కలిగిన 16 లక్షల 66 వేల మంది రైతులకు 8098 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లుగా వివరించారు.

మొత్తం 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రూపాయల రుణ మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతురుణ మాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టారని అన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ఎదుగుదలలో వ్యవసాయ రంగం పాత్ర ముఖ్యమైనదని అన్నారు. జిఎస్‌డిపిలో వ్యవసాయం వాటా 18 శాతంగా ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న వాదాన్ని సీఎం కెసిఆర్ మార్చేశారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రజల మధ్య కరెన్సీ చేతులు మారేశాతం తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుందని అన్నారు. వివిధ పథకాలతో ప్రజలకు అందుతున్న ఆర్ధికసాయంతో మనీ ఫ్లో పెరింగిందన్నారు. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేలా బ్యాంకు అధికారులు తోడ్పడాలని కోరారు. ముఖ్యంగా లీడ్ బ్యాంకు ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ 38వ ఎస్‌ఎల్‌బిసీ సమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇతర బ్యాంకర్ల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News