Monday, January 20, 2025

పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలి : గిరిజన సంఘం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యోక్షులు ఎం. ధర్మనాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు పోడు భూములకు జూన్ 24 నుంచి 30 వరకు పట్టాలు ఇస్తామని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే సిఎం కెసిఆర్ మరోసారి గిరిజనులకు మోసం చేసేటట్టుగా ఉందనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజనులు నేటికి పోడు పట్టాలు రాక, రైతుబంధు, రైతు బీమా అందక పోవడంతో 17 సంవత్సరాల నుండి మోసపోతూనే ఉన్నారని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి పోడు పట్టాల పంపిణీ ప్రారంభించి అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సందర్భాలలో పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతుందని ఇప్పటికైనా ఎన్నికల ముందు తమహామీ నిలబెట్టుకోవాలని సూచించారు. పోడు భూములు సాగు చేస్తున్న సందర్భాలలో పోలీసులు, ఫారెస్ట్ అధికారుల మధ్య జరిగిన దాడులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, కేసులన్నీ ఎత్తివేయాలని కోరారు. ఫారెస్ట్ భూముల మీద సర్వహక్కు ఉన్న గిరిజనులకు ఎటువంటి షరతులు లేకుండా హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అందరికీ పట్టాలు వచ్చేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు . ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు ఎం. బాలు నాయక్, ఎరుకల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. రఘు ఆర్. పాండు నాయక్, ఎం. గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News