Wednesday, January 22, 2025

రాజ్యసభ పోస్టుల భర్తీలో ఓబిసిలకు ప్రాధాన్యతనివ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాహుల్ గాంధీ ఆశయాల సాధన మేరకు చట్టసభలలో బడుగు బలహీన వర్గాలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ఐ కమిటీ ఓబీసీ సెల్ సీనియర్ జనరల్ సెక్రెటరీ స్వాతంత్ర సమరయోధుల వారసుడు తెలంగాణ ఉద్యమ యోధున్ని పోల్కం శ్రీనివాస్ మేరు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షిని కలిశారు.

హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో  ఆమెకు వారు పూల బొకే అందజేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి తనకు అవకాశం ఇవ్వాలని, అలాగే మేరు కులస్తులకు ఎంఎల్‌సిలు, రాజ్యసభ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ స్పూర్తితో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న క్రమంలో ఓబిసిలకు కూడా రాజకీయాల్లో ప్రాధాన్యతనివ్వాలన్నారు. రేవంత్ రెడ్డి సిఎంగా తెలంగాణ అధికారంలోకి వచ్చిన క్రమంలో ఓబిసిలను విస్మరించవద్దన్నారు. కనీసం త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులలో పది చైర్మన్ పదవులు, 25 మందిని డైరెక్టర్లుగా ఓబిసిలను నియమించాలని సూచించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, రాహుల్ గాంధీ ని కలవడానికి కూడా తమ మేరు యువజన సంఘం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శంకర్ పోల్కం వినయ్, రాజ్ గంగాపురం, దశరథ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News