Wednesday, January 22, 2025

మణిపూర్ ప్రజలకు భరోసా ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్ ప్రజలకు అన్ని రకాలుగా భరోసా కల్పించాలని బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని కేంద్రం చెప్పిందని ఆయన తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన న్యూఢిల్లీ పార్లమెంట్ లైబ్రరి బిల్డింగ్‌లో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశం లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున వినోద్‌కుమార్ హాజరయ్యారు.

అఖిలపక్షంలో పాల్గొన్న తరువాత వినోద్‌కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతు ల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మణిపూర్ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత ఉందని అఖిలపక్ష సమావేశంలో తాము చెప్పామన్నారు. మణిపూర్‌లో కుకి, నాగాలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారని, వారు 40 శాతం ఉం టారని, క్రిస్టియన్స్ మైనారిటీలు, మైదాన ప్రాంతంలో మెయితెయిలు నివసిస్తారని వారు దాదాపుగా 50శాతం మంది ఉంటారని ఆయన తెలిపారు. కారణాలు తెలియనప్పటికీ 1990నుంచి ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కుకిలు, నాగలు ఉన్న చోట తమను కూడా ఎస్టీల్లో చేర్చాలని మెయితెయిలు డిమాండ్ చేస్తున్నారని, ఎవరినైనా ఎస్టీల్లో చేర్చాలంటే ఆ హక్కు పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని వినోద్‌కుమార్ తెలిపా రు. కానీ, మణిపూర్ హైకోర్టు 4 వారాల్లో మెయితెయిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్పు ఇచ్చిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని, ఒకవేళ స్టే ఇ చ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగపోయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. 4వేల ఆయుధాలు మెయితెయిలు ఎత్తుకెళ్లడంతో, కేంద్ర బలగాలు మొ హరించారని చెబుతున్నారని, కావున ఆయుధాలను మెయితెయిలు డిజాల్వ్ చేయాలని ఆయ న సూచించారు. ఘర్షణల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయని, వేలాదిమంది నిర్వాసితుల య్యారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్రం వెంటనే వారికి పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 50 రోజులు ఇంటర్నెట్ నిషేధించడం మంచిది కాదని ఆయన సూ చించా రు. విద్యార్థులు, యువత, ఇతర సేవలకు అంతరాయం కలుగుతుందని, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణ చేయాలని తాము కోరినట్టు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రధాని స్పందించలేదని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News