Monday, January 20, 2025

ఆగస్టు 15లోపు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: సుమారు 24 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ లోపు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి తమకు న్యాయం చేయాలని 1998 డీఎస్సీ సాధన సమితి ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాధన సమితి ఏళ్ల తరబడి తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు.

ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వానికి తమకు జరిగిన న్యాయపోరాటంలో ఉన్నత న్యాయస్థానం తమకు న్యాయం చేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు ఉద్యోగులుగా అవకాశం కల్పించిందని చెప్పారు.

అదే తరహాలో తెలంగాణలోని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి తమ ఆవేదనను ఆలకించి తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కోరా రు. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర వేడుకల్లో ఉపాధ్యాయుల హోదాలో తామంతా పాల్గొనే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో నర్సిహ్మారెడ్డి, రఘురామరాజు, అడెపు రవీందర్, సిద్ధికి, నర్సయ్య, ఎస్ కే ఖాసిం, పద్మజ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News