న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ఉదార వ్యాపారవేత్తగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ చైర్మన్ శివ్ నాడార్ ముందు వరుసలో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.2,042 కోట్ల విరా ళం ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫి లాంత్రోపీ జాబితా 2023 గురువారం విడుదలైంది. దీనిలో హెచ్‌సిఎల్ సహ వ్యవస్థాపకుడు శి వ్ నాడార్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఆ యన 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,042 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే రోజూ రూ. 5.6 కోట్లు విరాళంగా ఇచ్చాడు.
రూ.1,774 కోట్లు విరాళంగా అందించిన విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కా మత్(37) అతి పిన్న వయస్కుడైన దాతగా ఉన్నారు. నిఖిల్ తన సోదరుడు జెరోధా సిఇఒ ని తిన్ కామత్ (44)తో కలిసి రూ.110 కోట్లు విరాళంగా అందించారు. 2023 ఆర్థిక సంవత్సరం లో రూ.8,445 కోట్లు విరాళంగా అందించిన 119 మంది దాతలు జాబితాలో చేరారు. ఇది గ తేడాది కంటే 59% ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఫి లాంత్రోపీస్ వ్యవస్థాపకురాలు రోహిణి నీలేకని ఉన్నారు. ఆమె రూ.170 కోట్లు విరాళంగా ఇచ్చారు.