అమరావతి: గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. చిత్తూరు జిల్లా రామానాయుడు పల్లెలో సిఎం మాట్లాడుతూ… దివ్యాంగుల పెన్షన్లు రూ. 6 వేలకు పెంచామని, 8 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. కిడ్నీ, తలసేమియా రోగులకు రూ. 10 వేలు అందజేస్తున్నామని వెల్లడించారు. ఎసి గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని, క్షేత్ర స్థాయిలోనే తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని తెలిపారు. పెన్షన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని అధికారులకు చెప్పామని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలని.. అదే తన ఆకాంక్షించారు. గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని వైసిపి మీద మండిపడ్డారు. ప్రజలు అన్నీ తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకు వచ్చారని, గత ఐదేళ్లు చేసిన విధ్వంసం నాకే అర్థం కావడం లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు రావాలి: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -