Friday, November 15, 2024

ఈ–వేస్ట్‌ ఛానలైజేషన్‌ పై వర్క్‌షాప్‌..

- Advertisement -
- Advertisement -

GIZ India held Workshop on E-Waste Channelization

న్యూఢిల్లీ: డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌(జీఐజెడ్‌) మరియు ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లు ఈ–సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ‘ఈ–వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూ చైన్‌ను ఏర్పాటుచేయడం’ శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం అమలు చేయడానికి చేతులు కలిపాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఈ–వ్యర్ధాలను సురక్షితంగా నిర్వహించడం పట్ల పాఠశాలలు, రిటైలర్లు, బల్క్‌ వినియోగదారులు సహా పలువురు వాటాదారులకు అవగాహన కల్పించడం. దీనిలో భాగంగా ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ఈపీఆర్‌(ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ) సమ్మతి, ఈపీఆర్‌ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు.
ఈ వర్క్‌షాప్‌ గురించి జీఐజెడ్‌ ఇండియా సర్క్యులర్‌ ఎకనమీ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ సీనియర్‌ ఎడ్వైజర్‌ గౌతమ్‌ మెహ్రా మాట్లాడుతూ.. ‘‘కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి సుదీర్ఘకాలంగా నిబంధనల అమలుకు ప్రయత్నిస్తోంది. ఈపీఆర్‌ పాలసీకి కట్టుబడి ఉండటం ద్వారా ఛానలైజేషన్‌కు సహాయపడుతుంది’’ అని అన్నారు. ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధికా కాలియా మాట్లాడుతూ.. ‘‘ఈపీఆర్‌ పాలసీ విజయం సాధించాలంటే వాటాదారులు తమ బాధ్యతలను గుర్తించడంతో పాటుగా మార్గదర్శకాలను అనుసరించడం చేయాలి. ఈపీఆర్‌ విధానాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నియంత్రిస్తుంది. అయితే భూగోళానికి నిలకడతో కూడిన భవిష్యత్‌ కావాలంటే మాత్రం వాటాదారులుతమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

GIZ India held Workshop on E-Waste Channelization

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News