Monday, December 23, 2024

అది పెద్ద తప్పేమీ కాదు

- Advertisement -
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడీగా, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అందాలొలకబోస్తోంది. ఇప్పటికి కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ భామ గత ఏడాది ‘జైలర్’ సినిమాలో చేసిన ‘కావాలయ్యా…’ ఐటమ్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఇంకా పెరుగుతుందా అన్నట్లుగా ఈ పాటలో ఆమెను చూస్తే అనిపిస్తుందని పలువురు కామెంట్స్ చేశారు.

సోషల్ మీడియాలో కొందరు ఈ పాటలో మిల్కీ బ్యూటీ గ్లామర్ షోపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై తమన్నా తాజాగా మాట్లాడుతూ “గ్లామర్ గా కనిపించడం, ఐటెం సాంగ్స్ చేయడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం మాత్రమే అనే విషయం గుర్తించాలి. కమర్షియల్ సినిమాల్లో ముఖ్యంగా పాటల్లో గ్లామర్ గా కనిపించడం పెద్ద తప్పేమీ కాదు. ఇలాంటి పాటల విషయంలో, స్కిన్ షో విషయంలో ప్రేక్షకుల మైండ్ సెట్ మారాలి. ఇంకా కూడా ఒక మూస పద్దతిలో… పాత తరహా వారిలా ఆలోచించడం సరైనది కాదు”అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News