Monday, December 23, 2024

టీ తాగుతూ చాయ్ గ్లాస్ మింగాడు?

- Advertisement -
- Advertisement -

Glass found in stomach

 

పాట్నా: చిన్న పిల్లలు తెలియని వయస్సులో ఏదో ఒకటి మింగుతుంటారు. కడుపులో నొప్పి బయటపడడంతో స్కానింగ్ చేస్తే అంత వరకు ఎవరికి తెలియటంలేదు. ఓ వ్యక్తి కడుపులో చాయ్ గ్లాస్ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్య పోయారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… 55 ఏళ్ల వ్యక్తి కడుపులో నొప్పి వస్తుందని బీహార్‌లోని ముజఫర్‌లోపి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. స్కానింగ్ చేయగా కడుపులో గ్లాస్ ఉన్నట్టు గుర్తించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అసాధ్యం కాకపోవడంతో ఆపరేషన్ చేసి గ్లాస్‌ను బయటకు తీశారు. తాను చాయ్ తాగేటప్పుడు గ్లాస్ కడుపులోకి పోయిందని సదరు వ్యక్తి తెలిపాడు. వైద్యులు గొంతులో నుంచి కడుపులోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మలద్వారం నుంచి పోయి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News