- Advertisement -
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ గాజు ప్రతిమను వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ ప్రతిమను సందర్శకులకు అనుమతించనున్నారు. పలు అంశాల్లో మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినందున కమలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి నల్లజాతి ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన మొదటి ఉపాధ్యక్షురాలు.. ఇలా పలు రికార్డులు ఆమెకు సొంతమయ్యాయి. అమెరికా చరిత్రలోనే ఇది చరిత్రాత్మక ఘట్టమని నేషనల్ ఉమెన్స్ హిస్టరీ మ్యూజియం అధ్యక్షురాలు హోళీ హోచ్నర్ అన్నారు. కమలాహారిస్ కలర్ ఫోటో ఆధారంగా ఆరున్నర అడుగుల పొడవు, ఆరున్నర అడుగుల వెడల్పైన గాజు ప్రతిమను కళాకారుడు సైమన్ బెర్గర్ రూపొందించారు.
- Advertisement -