Sunday, January 19, 2025

ఢిల్లీలో పగిలిన ఒవైసీ ఇంటి అద్దాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీ ఇంటి తలుపు అద్దాలు పగిలినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

పగిలిన అద్దం ముక్కలు కనిపించిన చోట రాయి కాని మరే ఇతర వస్తువు కాని లభించలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆ అధికారి తెలిపారు. దేశ రాజధానిలోని తన నివాసంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు ఒవైసీ ఫిబ్రవరిలో తెలిపారు. 2014 నుంచి ఇది నాలుగవ దాడిగా ఆయన అప్పట్లో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News