Monday, December 23, 2024

గ్లకోమా ఉంటే గుడ్డివారు కావాల్సిందేనా?

- Advertisement -
- Advertisement -

దీనిపై ప్రజలకు వైద్యశాఖ అవగహన కార్యక్రమాలు చేపట్టాలి
ప్రతి ఏటా లక్షలామంది చూపును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు
ప్రారంభం దశలో పరీక్ష చేసుకుని చికిత్స తీసుకుంటే కంటికి రక్షణ ఉంటుందని వైద్యులు వెల్లడి

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్లకోమా వ్యాధి ఒక దీర్ఘకాలికమైన, అంధత్వానికి దారి తీసే వ్యాధి. ఈవ్యాధి గురించి సాధారణమైన ప్రజల్లో అవగాహన లేదు. ప్రతి ఏడాది దేశంలో ఒక కోటి రెండు లక్షల మంది ఈ వ్యాధిన బారిన పడుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో 10లక్షలకు పైగా ప్రజలు అంధులుగా మారుతున్నారు. ఈగ్లకోమా వ్యాధిగ్రస్థులు సుదీర్ఘకాలంగా తమ కంటిలోని ఒత్తిడి పెరగడంతో కంటినరం దెబ్బతిని చూపు కోల్పోతున్నారు. ఈవ్యాధి ప్రారంభ దశలో మనం తెలుసుకుంటే అంధత్వాన్ని నివారించుకోవచ్చని కిమ్స్ ఆసుపత్రి ఆప్తామాలజీ విభాగం వైద్యులు బి. ప్రణతి సూచిస్తున్నారు. సాధారణంగా ఈవ్యాధి ఉన్న వారు తమ చూపులో మార్పులు వస్తున్నాయని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈవ్యాధి ఉన్నవారిలో ప్రథమంగా పక్కచూపు తగ్గడం మొదలై క్రమంగా పూర్తి చూపు కోల్పోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. దీని జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన చేసే కార్యక్రమాలు నిర్వహించాలని, వారం రోజులపాటు బస్తీలు, కాలనీల్లో వైద్య సిబ్బందితో ప్రచారం చేయించాలని పేర్కొంటున్నారు.

గ్లకోమా ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి:

1.హై మయోపియా, హైపరోపియా ఉన్నవారు
2. కుటుంబంలో గ్లకోమా వ్యాధిగ్రస్థులు
3. కంటి దెబ్బలు తగిలినవారు
4.శరీరంలో వేరే సమస్యలకు ఏరూపంలోనైనా స్టెరాయిడ్ మందులు వాడివారు
5. దీర్ఘకాలిక మధుమేహం, రక్తపోటు ఉన్నవారు వార్షిక కంటి పరీక్షలో భాగంగా చూపు పరీక్ష, కంటి ఒత్తిడి పరీక్ష, కంటి నాడీ పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈవ్యాధిని ముందే పసిగట్టవచ్చు. చాలామంది వారి ఇంటి వద్ద ఉన్న కళ్లజోళ్ల దుకాణాలలో పూర్తి పరీక్ష చేయించులేకపోవడంతో ఈ వ్యాధి ఉన్నా బయటపడటం లేదు. ఈప్రక్రియలో ఎంతో మంది ఆలస్యంగా చూ మందగించింది అని తెలుసుకుని కంటి వైద్యుల వద్దకు వచ్చే సరికి సగానికిపైగా చూపును కోల్పోతున్నారు. కొత్తగా వచ్చిన లేజర్లు, కంటిలో వేసే చుక్కల మందులు, సూక్షమైన శస్త్రచికిత్సల ద్వారా కొన్ని వేలాది మంది గ్లకోమా బాధితులు తమ చూపును కాపాడుకోగలుగుతున్నారు. అందుకోసం జనవరి మాసంలో గ్లకోమా అవగాహన నెల సందర్భంగా కంటి పరీక్ష చేయించుకోవాలని, చూపుని కాపాడుకుని కంటి వెలుగును రక్షించుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News