Wednesday, January 22, 2025

అందుబాటులోకి తొలి నాజల్ స్ప్రే..

- Advertisement -
- Advertisement -

ముంబై: కరోనా బాధితులకు చికిత్స కోసం భారత్‌లో తొలి నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబై కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ‘ఫాబిస్ప్రే’ పేరుతో దీన్ని విడుదల చేసింది. కొవిడ్ బాధితులైన వయోజనులకు ఈ స్ప్రేను అందించవచ్చని తెలియజేసింది. కెనడాకు చెందిన సనోటైజ్ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను భారత్‌లో తయారీ, మార్కెట్ చేసుకునేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డిసిజిఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నాజల్ స్ప్రే తీసుకున్న 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్ తగ్గుతుండగా, 48 గంటల్లో 99శాతం తగ్గుతున్నట్టు భారత్‌లో జరిపిన మూడోదశ ప్రయోగాల్లో వెల్లడైంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సురక్షితమే కాకుండా కొవిడ్ బాధితులకు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తడంలేదు. ఫాబిస్ప్రే పేరుతో దీన్ని మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ వెల్లడించింది.

ముక్కుద్వారా దీన్ని తీసుకున్నప్పుడు వైరస్‌ను అడ్డుకోవడంలో భౌతికంగా, రసాయనంగా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. కొవిడ్‌కు కారణమైన వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరకముందే శ్వాసకోశ మార్గం ప్రవేశంలోనే నిర్మూలించే లక్షంతోనే ఫాబిస్ప్రేను అభివృద్ధి చేశామని గ్లెన్‌మార్క్ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాజల్ స్ప్రే ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని, ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతో ఎస్సిలాన్ వాంటి వేరియంట్లను ఈ స్ప్రే కొన్ని నిమిషాల్లోనే నాశనం చేస్తున్నట్టు అమెరికాలోని యూటాస్టేట్ యూనివర్శిటీ ప్రయోగాల్లో తేలిందని గ్రెన్‌మార్క్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ పేర్కొన్నారు. భారత్‌లో 20చోట్ల 306 మంది కొవిడ్ బాధితులపై ప్రయోగాలు చేయగా సురక్షితమని తేలడంతో డిసిజిఐ అనుమతులు మంజూరు చేసింది.

Glenmark Launches first nasal spray for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News