Friday, November 15, 2024

హైపర్‌ టెన్షన్‌ అవగాహన చిహ్నాన్ని విడుదల చేసిన గ్లెన్‌మార్క్‌

- Advertisement -
- Advertisement -

Glenmark launches Hypertension Awareness symbol

న్యూఢిల్లీ: ఆవిష్కరణ ఆధారిత, గ్లోబల్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ , గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (గ్లెన్‌మార్క్‌) ప్రపంచ హృదయ మాసాన్ని సెప్టెంబర్‌ నెలలో నిర్వహించింది. దీనిలో భాగంగా 300 హైపర్‌టెన్షన్‌ ప్రజా అవగాహన ర్యాలీలు మరియు 8వేలకు పైగా హైపర్‌టెన్షన్‌ స్ర్కీనింగ్‌ క్యాంప్‌లను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 42 నగరాలలో 8వేల మందికి పైగా డాక్టర్లు, 10వేల మందికి పైగా హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ తో భాగస్వామ్యం చేసుకుని 10 కోట్ల మంది భారతీయులను చేరుకోవడం లక్ష్యంగా చేసుకుంది. ఈ ర్యాలీలను దేశవ్యాప్తంగా పలు హాస్పిటల్స్‌ తో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించింది. హైదరాబాద్‌, చెన్నైలలో 13 అవగాహన ర్యాలీలలను దీనిలో భాగంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమాలను గురించి గ్లెన్‌మార్క్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – హెడ్‌ ఆఫ్‌ ఇండియా ఫార్ములేషన్స్‌, అలోక్‌ మాలిక్‌మాట్లాడుతూ ‘‘దేశంలో రక్తపోటు పట్ల అవగాహన కల్పించాలనే మా ప్రయత్నాలలో భాగం ఈ కార్యక్రమాలు. కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ) ప్రమాదాలకు కారణం కావడంతో పాటుగా హైపర్‌టెన్షన్‌ చాలామందిలో నిశ్శబ్ద హంతకిగా ఉంటుంది. రక్తపోటు నిర్వహణలో అగ్రగామిగా గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు ఈ వ్యాధితో పోరాటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుంది’’ అని అన్నారు. గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు రక్తపోటు పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా టేక్‌ చార్జ్‌ ఎట్‌ 18 ప్రచారం నిర్వహించడం ద్వారా 18 సంవత్సరాలు దాటిన పెద్ద వయసు వారికి పరీక్షలు నిర్వహించింది. అదే రీతిలో తమ వెబ్‌సైట్‌ www.bpincontrol.in.. ద్వారా 200 మిలియన్‌ భారతీయులను చేరుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

Glenmark launches Hypertension Awareness symbol

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News