Sunday, January 19, 2025

కిషన్ రెడ్డికి ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సి లీడర్‌షిప్ అవార్డు’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్- టు -పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్ర మంత్రికి అందజేసింది. భారత్ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News