Monday, December 23, 2024

ఎపికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. తమ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న వైజాగ్‌కు, సిస్టర్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదనాంలో ఈ నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలను, విదేశీ ప్రతినిధులు ఆహ్వానించనున్నారు. ఈ రెండు రోజుల సందస్సులో మొత్తం 9 రంగాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో 26 దేశాలు పాల్గొననున్నాయి. 8 వేల మంది అతిథులు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News