- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్‌నేషనల్ భారీ పెట్టుబడి పెట్టనుంది. అడ్వెంట్ ఇంటర్‌నేషనల్ సంస్థ తెలంగాణలో సుమారుగా రూ.16650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కెటిఆర్‌తో సంస్థ ఎండి పంకజ్ పట్వారీ, ప్రతినిధుల సమావేశం జరుగుతోంది. తెలంగాణలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను ప్రతినిధులు వివరించనున్నారు. ఈ సంస్థ పెట్టుబడిపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదబాబాద్ వృద్ధికి సంకేతమని కెటిఆర్ పేర్కొన్నారు. అడ్వెంట్ ఇంటర్‌నేషనల్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరపున సహకరిస్తామన్నారు.
Also Read: సాగునాథన్ కన్నుమూత
- Advertisement -