Monday, December 23, 2024

రక్తమోడిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : అమెరికాలో మాంద్యం భయాలు, ఇరాన్‌ ఇజ్రాయెల్ యుద్ధం సంకేతాలతో ప్రపంచ దేశాల మార్కెట్లు కుప్పకూలా యి. ఈ ప్రభావంతో సోమవారం దేశీయంగా బాంబే స్టాక్ ఎ క్సేంచ్ సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ సూచీ 662 పాయింట్లు పడిపోయింది. కరోనా తర్వాత మార్కె ట్ల్లు ఇంతలా పతనం కావడం ఇప్పుడే.. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.15.33 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం మదుపర్ల సంపద రూ.457.16 లక్షల కోట్ల నుంచి రూ. 441.83 లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యా ప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ, మెటల్, పిఎస్‌యు బ్యాంక్, మీడియా సూచీలు కూడా నాలుగు శాతం నష్టపోయాయి. ఆటో, ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 3 శాతానికి పైగా పడిపోయాయి.

మార్కెట్‌కు బ్లాక్ మండే
ఈ వారంలోని మొదటి ట్రేడింగ్ సెషన్ భారతీయ స్టాక్‌మార్కెట్ కు బ్లాక్ మండేగా ఓ పీడ కలలా మారింది. జపనీస్ స్టాక్ ఎ క్స్ఛేంజీ నిక్కీ 225లో 13 శాతం (4,750 పాయింట్లు) పతనం కావడం, మాంద్యం భయంతో అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించడంతో భారత మార్కెట్లలో గందరగోళం నెలకొంది. సోమవారం ఇంట్రాడేలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,800 పాయింట్లు, నిఫ్టీ 825 పాయింట్లు పడిపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కూడా మార్కెట్‌లో ఈ సునామీ కారణంగా భారీగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్ లో ఈ పతనం కారణంగా ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్లు రూ.15.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,222 పాయిం ట్లు పతనమై 78,759 వద్ద, నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 పాయింట్ల వద్ద ముగిశాయి.

వెల్లువెత్తిన అమ్మకాలు
ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలు జరిపారు. ఈ కారణంగా భారత్ ఫోర్జ్ 6.18 శాతం, మదర్‌సన్ 9.18 శా తం, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8.34 శాతం, టాటా మోటార్స్ 7.31 శాతం, ఎంఫాసిస్ 4.43 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.19 శాతం, హిందుస్థాన్ కాపర్ 6.71 శాతం, నోల్కో 6.7 శా తం, ఒఎన్‌జిసి 6.01 శాతం, జిఎంఆర్ విమానాశ్రయం 5.61 శాతం క్షీణతతో ముగిశాయి. ఇంత పతనంలోనూ డా. లాల్‌పత్ ల్యాబ్ 2.05 శాతం, మారికో 1.47 శాతం, డాబర్ ఇండియా 1.03 శాతం, హెచ్‌యుఎల్ 0.87 శాతం, నెస్లే 0.63 శాతం, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ 0.49 శాతం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ పెరుగుదలతో ముగిశాయి.

రూ.457 లక్షల కోట్లకు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
భారత స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో నష్టపోయారు. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.457.16 లక్షల కోట్ల వద్ద ఉంది. అయితే సోమవారం ఇది రూ.441.83 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు రూ.15.33 లక్షల కోట్లు నష్టపోయారు.

రెడ్ మార్క్‌లో అన్ని రంగాల స్టాక్‌లు
భారీ క్రాష్ కారణంగా అన్ని రంగాల షేర్లలో క్షీణత నెలకొంది. ఇటీవల కాలంలో భారీ లాభాలను చవిచూసిన పిఎస్‌యు షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఐటి, -ఆటో అండ్ ఎనర్జీ, బ్యాం కింగ్, మెటల్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు క్షీణతతో తీవ్రంగా నష్టపోయాయి. మొత్తం ట్రేడైన 4,189 షేర్లలో దాదాపు 3,414 షేర్లు క్షీణించాయి. 664 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి

మార్కెట్ క్షీణతకు ఐదు కారణాలు
n అమెరికాలో మాంద్యం భయం పెరిగింది, దీని కారణంగా
గత ట్రేడింగ్ రోజున అమెరికన్ మార్కెట్‌లో క్షీణత ఉంది.
ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ప్రభావం
కనిపిస్తోంది.
n ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సంకేతాలతో ప్రపంచ
మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొంది. ఇది భారత
స్టాక్‌మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది.
n వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే యాపిల్‌లో తన
50 శాతం వాటాను విక్రయించింది. ఇతర పెద్ద
పెట్టుబడిదారులు కూడా విక్రయిస్తున్నారు.
n భారత స్టాక్‌మార్కెట్ ప్రస్తుత విలువలు భారీగా పెరిగాయి.
ఈ కారణంగా ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో
గణనీయమైన కరెక్షన్ కనిపిస్తోంది.
n బ్యాంక్ ఆఫ్ జపాన్ తన వడ్డీ రేటును 0%, 0.1% నుండి
0.25%కి పెంచింది. 15 ఏళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి,
దీంతో గ్లోబల్ సెంటిమెంట్లు కూడా బలహీనపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News