Friday, November 22, 2024

మోడీ నాయకత్వంలో ఆర్థిక విదేశీ విధాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, సామాజిక పరిపాలన, విదేశీ విధాన రంగాల్లో గణనీయమైన విజయాలు సాధించిదని చైనాకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ప్రభుత్వ అధీనంలోని మీడియా సంస్థల్లో ఒకటయిన గ్లోబల్ టైమ్స్ గత నాలుగేళ్ల కాలంలో భారత్ సాధించిన విజయాలను హైలెట్ చేస్తూ షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సౌత్ ఏసియా స్టడీస్ డైరెక్టర్ ఝాంగ్ జియాడోంగ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రచురించింది. భారత్ ఆర్థికాభివృద్ధిలోగణనీయమైన వృద్ధి సాధించిందని, పట్టణ పరిపాలన ఎంతో మెరుగుపడిందని పేర్కొన్న ఆ వ్యాసం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా చైనా విషయంలో దాని వైఖరిలో మార్పు వచ్చిందని పేర్కొంది.‘ ఉదాహరణకు చైనా, భారత్‌ల మధ్య వాణిజ్య అసమానతల గురించి చర్చించేటప్పుడు భారతీయ ప్రతినిధులు గతంలో ఈ అసమానతలను తగ్గించడంలో చైనా తీసుకునే చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టే వారని, కానీ ఇప్పుడు భారత ఎగుమతుల సామర్థం గురించి ఎక్కువగా నొక్కి చెబుతున్నారు’ అని ఝాంగ్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

ఆర్థిక, సామాజిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించిన భారత్ భారతీయతను ఎక్కువ ప్రచారం చేసేందుకు వ్యూహాత్మకంగా మరింత ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తోందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఒకప్పుడు పాశ్చాత్య ప్రజాస్వామిక విలువల గురించి నొక్కి చెప్పే భారత్ ప్రజాస్వామిక రాజకీయాల్లో భారతీయత గురించి హైలెట్ చేస్తోందని కూడా పేర్కొంది. వలసపాలన నీడనుంచి బయటపడి, రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారాలన్న దాని ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తోందని ఈ నెల 2న ప్రచురితమైన ఆ వ్యాసం పేర్కొంది. అంతేకాకుండా ప్రధాని మోడీ నాయకత్వంలో భారత విదేశీ విధానాన్ని కూడా ఆ వ్యాసం ప్రశంసించింది. భార ఒకే దేశంతో కాకుండా అమెరికా, జపాన్, రష్యా లాంటి ప్రపంచ శక్తులతో తన సంబంధాలను పెంచుకుంటోందని, అలాగే రష్యాఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ విధానాన్ని పాటిస్తోందని కూడా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచినప్పటినుంచి ఆయన బహుళ అమరిక వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తున్నారని, అమెరికా, జపాన్, రష్యా తదితర దేశాలతో,

ఇతర ప్రాంతీయ కూటములతో భారత దేశ సంబంధాలను పెంచుకుంటున్నారని ఝాంగ్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ‘ భారత దేశం ఎప్పుడు కూడా తనను ప్రపంచ శక్తిగానే భావిస్తూ ఉండేది. అయితే గత పదేళ్లనుంచి అది మల్టీ బ్యాలెన్సింగ్‌నుంచి మల్టీ అలైన్‌మెంట్ వైపు మళ్లింది. అది ఇప్పుడు బహుళ ధ్రువ ప్రపంచంలో ఒక మూలస్తంభంగా మారే వ్యూహం దిశగా శరవేగంగా వెళ్తోంది. అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఇంత వేగంగా మార్పులు జరగడం చాలా అరుదుగా కనిపిస్తాయి’ అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నాయి. భారత దేశం ఒక భౌగోళిక రాజకీయ వాస్తవంగా మారిన విషయాన్ని చాలా దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఝాంగ్ తన వ్యాసం ముగింపులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News