Friday, November 22, 2024

భారత్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం తర్వాత భారత్ పట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చైనా ప్రభుత్వ అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుదలను ప్రశంసిస్తూ ఇటీవల వచ్చిన వ్యాసాన్ని ఉదహరిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లోని ఇండియా హౌస్‌లో ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘గ్లోబల్ టైమ్స్ పత్రికను చైనా ప్రభుత్వ పత్రికగా అందరూ భావిస్తారు. అలాంటి పత్రికలో ఓ కాలమిస్టు భారత్ ఎదుగుదలను ప్రశంసిస్తూ ఓ వ్యాసం రాశారు. భారత్ పట్ల చైనా వైఖరి మారిందనడానికి ఇది బలమైన ఉదాహరణ. అరుణాచల్ ప్రదేశ్‌లోని గల్వాన్ లోయవద్ద చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఘర్షణ సందర్భంగా భారత జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు మన దేశం పట్ల చైనా తన వైఖరిని మార్చుకోవడానికి తోడ్పడిందని నేను భావిస్తున్నాను.

ప్రపంచ దృష్టిలో మేము ఇప్పుడు బలహీన దేశం కాదు. మేము ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న దేశం. ఇప్పుడు ఎవరు కూడా భారత్‌ను భయపెట్టలేరు సరికదా, దానినుంచి తప్పించుకోనూ లేరు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అంతేకాదు తాము ఎవరినీ శత్రువుగా చూడమని అంటూ, అయితే భారత్, చైనాల మధ్య సంబంధాలు ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాయని ప్రపంచానికి తెలుసునని రాజ్‌నాథ్ అన్నారు. అయితే తాము తమ పొరుగుదేశాలతోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలతోను మంచి సంబంధాలను కలిగి ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. చైనాకు ఇష్ట ఉన్నా లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను పట్టించుకోకుండా ఉండలేమన్న వాస్తవాన్ని అది అంగీకరించిందని రక్షణ మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News