న్యూయార్క్: వచ్చే ఏడాది ప్రపంచం మాంద్యం ముప్పు ఎదుర్కోనుందని ప్రపంచ బ్యాంక్ నివేదించింది. 2023లో ద్రవ్య విధానం మరింత సంక్లిష్టంగా మారనుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు ఉత్పత్తిని పెంచడంతోపాటు సరఫరాకు ఎదురయ్యే ఆటంకాలను నివారించాలని ప్రపంచ ఆర్థిక సంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచిఉందని ఇప్పటికే అనేక సంకేతాలు వెలువడ్డాయి. గత మాంద్యం నుంచి కోలుకున్న అనంతరం ప్రపంచ 1970నుంచి మందగమనంలో ఉందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయి. ప్రపంచ వృద్ధి నెమ్మదించడంతో చాలా దేశాలు మాంద్యంలో పడనున్నాయి. ఈ ధోరణి ఎక్కువకాలం కొనసాగనుందని ఈక్రమంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు, వ్యాపారాలు తిరోగమనంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వరల్డ్‌బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ ప్రకటనలో తెలిపారు. కాగా అమెరికా నుంచి యూరప్ దేశాలతోపాటు భారత్ తదితర దేశాలు ద్రవ్య సరఫరాను నియంత్రించేందుకు రుణాల రేట్లును విపరీతంగా పెంచుతున్నాయి. ద్రవోల్బణం అదుపు చేసేందుకు నాలుగు శాతం చేరే అవకాశం ఉంది. అయితే ఈ కారణంగా పెట్టుబడులు తగ్గిపోవడంతోపాటు ఉద్యోగాల్లో కోత, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారత్‌తోసహా అనేక దేశాల్లో వ్యాపారాలు మూతపడుతున్నాయి. ప్రభుత్వ సమాచారం ప్రకారం జులైలో 6.71 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టునాటికి ఏడుశాతానికి పెరగడంతో భారతదేశవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగిపోయాయి. రిజర్వుబ్యాంకు ఇండియా (ఆర్‌బిఐ) 50బేసిస్ పాయింట్లతో మూడోసారి రెపోరేటు పెంచింది. 202223లో ద్రవోల్బణం 6.7శాతం ఉండనుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. కాగా ప్రపంచబ్యాంకు ఆర్థికవేత్తలు జస్టిన్ డామియెన్ గునెట్, ఎం అహాన్‌కోస్, నౌటకా సుగవారా అభిప్రాయాల ఆధారంగా వరల్డ్‌బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. గ్లోబల్ మాంద్యం పెరగకుండా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్ బ్యాంకులు నిరంతరం తమ ప్రయత్నాలను కొనసాగించాలని నివేదికలో పేర్కొన్నారు.
Global to Face Recession in 2023: World Bank